పార్వతమ్మ తన ఆవేదన పక్కింటావిడతో ఇలా చెప్పుకుంటుంటే విన్నాను,నిజమే కదా పాపం అనిపించింది.
బిడ్డలు కలగాలని కలలు కని,నవ మాసాలు మోసి,కని,అపురూపముగా పెంచి,చదువుసంధ్యలు చెప్పించి,చిన్న చీమ కుట్టినా మనసంతా విలవిలలాడిపోయి,కంటికి రెప్పలా కాచుకుని,వాళ్ళ పరీక్షలకు నేను నిద్ర కాచి,వాళ్ళ రిజల్టు కోసం నేను మొక్కులు మొక్కి,వాళ్ళు ఉన్నతస్థానం లో ఉండాలని కోరుకుంటూ,వాళ్ళకు నచ్చిన వాళ్ళతోనె వాళ్ళ పెళ్ళిళ్ళు చెసి,వాళ్ళకు పుట్టబోయే బిడ్డలతో ఆడుతూ పాడుతూ శేష జీవితం గడపాలనుకున్నాను వదినా..నా బిడ్డలు నన్ను ఒక యంత్రంగా చూస్తారని నేను అసలు వూహించలేదు.
నా కొడుకుకోడలు ఇద్దరూ వుద్యోగులైతే వారి జీవితం హాయిగా సాగుతుంది అనుకున్నాను కాని,నేను వాళ్ళకు పనిమనిషిని అవుతాను అనుకోలేదు.నా పిల్లలకు నేను చేసిపెట్టుకొవడం నాకు కష్టం కాదు కాని,నా కష్టాన్ని గుర్తించక,చిన్న పొరపాటు జరిగినా కొడుకుకోడలు ఇద్దరూ కసురుకోవడం,విసుక్కోవడం చూస్తే చాలా బాధగా ఉంది.వాళ్ళ పిల్లలపని,ఇంటిపని,వంటపని చేసి అలసట అనిపిస్తే కాస్త విశ్రాంతి తీసుకోమని అనడానికి కూడా వాళ్ళకు నోరు రావడం లేదు..వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళు ఆఫీసు నుండి వచ్చాక కాస్త కునుకు తీద్దాం అంటె ఒప్పుకోరు..ఆఫీసు నుండి అలసిపోయి వచ్చాము,కాస్త టీ ఇవ్వు,కాస్త స్నాక్స్ పెట్టు అని మొదలుపెదతారు..అది మొదలు రాత్రి భోజనాలు అయ్యేదాక నాకు ఇక తీరిక దొరకదు,మళ్ళీ రేపటికి యేం టిఫిను చేయాలి,యే కూరలు చేయాలి అనె టెన్సన్ తోనే నిద్రపోతాను..
యెప్పుడైనా యేదైనా కాస్త సుస్తీ చేస్తే,యెప్పుడూ యేదొ ఒక రోగం,నొప్పి అని యెడుస్తుంటావ్,లేచి తిరుగులాడు,అన్ని తగ్గిపోతాయ్ అంటారు.ఈ వయసులొ నొప్పులు,రోగాలు రాక,పసిప్రాయం తిరిగొస్తుందా వదినా...నన్ను వూరికి పంపించండి అంటె యెవరి కోసం చేస్తున్నావ్,ఇది నీ ఇళ్ళు కాదా,నీ సంసారం కాదా అని నిలదీస్తారు..జైలు జీవితం లా ఉంది నాకు ,పక్కింటి వాళ్ళతో మాట్లాడకూడదు,సీరియల్లు,టివి ప్రోగ్రాములు చూడకూడదు,వాళ్ళ పిల్లలకు చిన్న జలుబు,దగ్గు వచ్చినా నాకే తిట్లు....పెద్దదానివి ఆ మాత్రం తెలియదా,పిల్లలకు యేమి పెట్టాలో,యేవి పెట్టకూడదొ అని,నేను గొడ్డుదాన్ని,పిల్లలని పెంచనిదాన్ని అన్నట్లు మాట్లాడెవారు..వద్దు దేవుడా వీడి దగ్గర అని కొన్నాళ్ళు కూతురి దగ్గర ఉన్నాను..అక్కడా అదే తంతు....
అల్లుడు ప్రతి చిన్న విషయానికి నన్ను తప్పు పట్టడం,ఆ విషయంలో అమ్మాయికి అల్లుడికి గొడవలు కూడా వచ్చేవి..యెంత చదువూ సంస్కారం వున్నా ఒక్కొసారి ఇంత మూర్ఖులుంటారా అనిపించేది అళ్ళుడి తీరు..అతని ముందు కాస్త టివి చూడకూడదు,ఫక్కింటి వాళ్ళతో మాట్లాడకూడదు,నా అన్నదమ్ములకు యెప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడకూడదు..అమ్మాయితో పిల్లలతో సరదాగా మాట్లాడడం చూసినా ఒప్పుకోడు..పిల్లలకు మీ అమ్మ మొరటు మాటలు,మొరటు తిళ్ళు నేర్పిస్తుంది,తనకు దూరంగా ఉంచు అనేవాడు..అమ్మాయి నాతో చెప్పకపోయినా నాకు వినపడేలా అనేవాడు కాబట్టి వినిపించేది..తన తల్లికిచ్చిన గౌరవం నాకు ఇచ్చేవాడు కాదు,నేను కూడా తన తల్లి లాంటి దాన్నే కదా..అదేమిటొ మరి అతనికి అంత కినుక అత్తగారంటే..మేము మాత్రం అల్లుడికివ్వాల్సిన గౌరవం అల్లుడికిస్తాం,కాని వాళ్ళు అలా ప్రవర్తిస్తారు..కూతురు కూడా అల్లుడికే వత్తాసు..పాపం తను మాత్రం యేం చేస్తుంది..నేను కాదు కద తన జీవితం.తన భర్తే తన జీవితం...
ఇదంతా కాని పని అని,నేను మన వూరికి వచ్చేసాను..యెప్పుడైనా పిల్లలని చూడాలి అనిపిస్తే వెళ్ళి చూసొస్తాను,ముసలితనంలో కూడా కృష్ణా,రామా అనుకునె తీరిక లేని జీవితం,అది కూడా నా కష్టానికి విలువ ఇవ్వని మనుషుల మధ్య ఉండడం చాలా కష్టం వదినా....నన్ను తిట్టే వాళ్ళు,మొఖం ముడుచుకుని దెప్పిపొడుపు మాటలు అనేవాళ్ళు యెవరూ లేరు...నా జీవితం,నా కష్టం..సంతోషంగా బ్రతికేస్తాను... ఈ పిల్లలు మనల్ని అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళకు మన వయసు రావాలి,వాళ్ళ స్థానంలో వాళ్ళ పిల్లలుండాలి.అప్పుడు మనని గుర్తుకుచేసుకోక మానరు..
పార్వతమ్మ ఒకతే కాదు,అలాంటి తల్లులు చాలా మందే ఉన్నారు..వాళ్ళది పసిపిల్లలను పెంచే వయసుకాదు,పనిభారం మోసే వయసూ కాదు..కాని కొందరు పిల్లలు మాత్రమే తమ తల్లితండ్రులను అర్థం చెసుకోగలుగుతున్నారు.ఇంకొందరు మహానుభావులు ముదిమివయసులో తల్లితండ్రులను విడగొట్టినంత పని చేస్తున్నారు.పని చేయడం కోసం తల్లి కావాలి,తండ్రివారికి అవసరం లేదు.అతను యెలా ఉన్నా పట్టించుకునే నాథుడు ఉండదు.ఒకవేళ యెప్పుడైనా తల్లి తన భర్తను గుర్తు చేసుకుని కాస్త ఫోను చేసి మాట్లాడినా తప్పు పట్టే కొడుకులు,కోడళ్ళు,కూతుళ్ళు,అళ్ళుల్లు ఉన్నారు..ఇక్కడ పార్వతమ్మకి భర్త లేనట్లుగా ఉంది..పార్వతమ్మ శేష జీవితం తను కోరుకున్నట్లుగా ఉండాలని కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండి