30, మార్చి 2023, గురువారం

అమాయకపు పండు

 అమ్మ:నాన్నా పండూ!!పెద్దయ్యాక నువ్వేమవుదాం అనుకుంటున్నావ్?

పండు:నేను బాగా చదువుకుని సెక్యూరిటి గార్డ్ అవుతానమ్మా

అమ్మ:యెందుకురా

పండు:సెక్యూరిటి గార్డ్ చాలా పవర్ ఫుల్..యూనిఫాం వేసుకుని,క్యాప్ పెట్టుకుని,స్టిక్ పట్టుకుని విజిల్ వేస్తే ఎంత పెద్ద కార్ అయినా ఆగాల్సిందే అమ్మా..

ఎక్షాంలో ఆన్సర్ తెలియకపోతే ఇలా చేస్తే సరి...

 పప్పీ:అమ్మా!!,లక్కీ ఎక్షాం లో క్వశ్చన్ పేపర్ చూసి ఆన్సర్ రాయకుండా యేడుస్తూ కూర్చుంది

అమ్మ:యెందుకమ్మా...యెందుకేడ్చింది??

పప్పీ:ఆన్సర్ రాదని!!

అయినా ఆన్సర్ రాకుంటే పేపర్ టీచర్ కి ఇచ్చేస్తే సరిపోతుంది కదమ్మా,చూసుకుంటూ యేడవడం దేనికో😕

అమ్మ:అంతే కదా..

(మనసులో ఇంత సింపుల్ లాజిక్కు తెలియక నేను కూడా చాలా సార్లు ఎక్షాం హాలులో తలపట్టుకుని కూర్చున్నానే అనుకుంటూ)

మా కిడ్స్ కొత్త తెలుగు ప్రొనౌన్ కనిపెట్టారోచ్....

 పప్పీ:అద్వైతా! నీది నాది సేం టిఫిన్ వే

అద్వైతా:అవునువే

పండు:వే.. వే.. అంటున్నారు.వే అంటే యేంటి?

పప్పీ:ఇంగ్లీషులో ప్రొనౌను హీ,షీ,ఇట్ లాగే తెలుగులో అతను,ఆమె,ఇది,అది,వే..

పండు:అమ్మాయిలకు వే,మరి అబ్బాయిలకు??

పప్పీ:అది కూడా తెలియదా అన్నయ్యా..రే,ఒరేయ్😃

పెరుగు-తోడు

 అమ్మ:భోజనం చేసారా తల్లీ??(ఆఫీసు నుండి రాగానే అడిగింది)

పప్పీ:చేసాం  అమ్మా!!

అమ్మ:తోడుకు పెరుగు తీసారా?

పండు:తోడు అంటే యేమిటమ్మా?

పప్పీ:మనం తినేది పెరుగు,తినకుండా రేపటికి వేరే గిన్నెలో దాచేది తోడు అన్నయ్యా!!

అమ్మ:అంతే పండూ..

(మనసులో తనకన్నా బాగా సమాధానం చెప్పిన పప్పీ ని చూసి మురిసిపోతూ)😊